Hanuman Junction Temple: కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌లో తెలుగుదేశం నేతలు దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు పర్యటించారు. అభయాంజనేయ స్వామి నగలు మాయమవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం దేవాలయాలను భ్రష్టు పట్టిస్తోందని నేతలు మండిపడ్డారు. దుర్గమ్మ సన్నిధిలో మూడు సింహాలు మాయమైనప్పుడు ఈవోగా ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా.. ఆర్జేసీగా పదోన్నతి ఇచ్చిన ఫలితమే ఆంజనేయస్వామి నగలు తాకట్టు పెట్టే పరిస్థితికి దారి తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగలు మాయమైతే ఇప్పటివరకు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి స్పందించకపోవడం దారుణమన్నారు.
TDP Fire: 'దేవుడి నగలు మాయమైతే.. దేవదాయశాఖ మంత్రి స్పందించకపోవడం దారుణం' - విజయవాడ వార్తలు
Theft in Temple: విజయవాడ హనుమాన్ జంక్షన్‌లోని అభయాంజనేయ స్వామి నగలు మాయమవ్వడంపై తెదేపా నేతలు అసహనం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం దేవాలయాలను భ్రష్టు పట్టిస్తోందని నేతలు మండిపడ్డారు. దేవుడి నగలు మాయమైతే ఇప్పటివరకు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి స్పందించకపోవడం దారుణమన్నారు.
tdp leaders Devineni Uma and Bachchula Arjunudu
దేవుని నగలు మాయం..
హనుమాన్‌జంక్షన్‌లో కొలువైన అభయాంజనేయస్వామి ఆభరణాలకే భద్రత ప్రశ్నార్థకమైంది. సొంత నగల మాదిరి కొందరు తాకట్టు పెట్టుకుని, వచ్చిన నగదుని తమ అవసరాలకు వాడేసుకున్నారన్న ఆరోపణలు సోమవారం భక్తుల్లో కలకలం రేపాయి. తనఖా పెట్టి తెచ్చిన సొమ్ము సుమారు రూ.10 లక్షల పైనే ఉంటుందనే ఫిర్యాదులు ఉన్నతస్థాయికి వెళ్లడంతో రెండ్రోజుల నుంచి దేవాదాయశాఖ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం ఆర్జేసీ ఎం.వి.సురేష్‌బాబు సమక్షంలో నగలు లెక్కించగా కొన్ని మాయమైనట్లు నిర్ధారించారు.