ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అవన్నీ సీఎం జగన్​కు తెలిసే జరుగుతున్నాయన్న తెదేపా - TDP leaders on CM Jagan

TDP leaders on CM Jagan వైకాపా నేతలు అనవసర విమర్శలు మానుకోవాలని తెదేపా నేతలు హెచ్చరించారు. నియంతలెందరో కాలగర్భంలో కలిసిపోయిన ఘటనలు గుర్తుపెట్టుకోవాలని తెదేపా నేత యరపతినేని అన్నారు. వైకాపా నేతలు మైనింగ్ దోపిడీతో అక్రమార్జన చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్, ఫ్యాక్షన్ మాఫియాలు సాగుతున్నాయన్నారు. విశాఖలో వైకాపా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

TDP leaders
తెదేపా నేతలు

By

Published : Aug 20, 2022, 1:56 PM IST

Updated : Aug 21, 2022, 10:16 PM IST

TDP on YSRCP: ముఖ్యమంత్రి సహా వైకాపా నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ హెచ్చరించారు. తాత్కాలిక అధికారం కోసం ఇష్టానుసారం తెదేపా, చంద్రబాబు కుటుంబ సభ్యులపై నోరు పారేసుకుంటే సహించేది లేదన్నారు. తప్పు చేసి కులం పేరు చెప్తే చంద్రబాబు చెప్పు మాత్రమే చూపించమన్నారు. బరితెగించి ప్రవర్తించే వారికి చూపించాల్సిన సినిమా చాలా ఉందన్నారు. ఏ ఒక్కరినీ వదలబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతలెందరో కాలగర్భంలో కలిసిపోయిన ఘటనలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. తీరు మార్చుకోకుంటే ప్రకృతి ప్రకోపానికి బలికాక తప్పదన్నారు. వైకాపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ దోపిడీతో అక్రమార్జన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాచేపల్లిలో కూలీ అడిగిన వడ్డెర కార్మికులపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. అక్రమ మైనింగ్​పై మూడేళ్లుగా తాము చెప్తున్నా... అధికారులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రోజుకు రూ.5కోట్ల అక్రమార్జన చేసే దాచేపల్లిలో, వాటాల్లో తేడాలు రావడం వల్లే.. అధికార పార్టీలో రెండు వర్గాలు బహిరంగంగా రొడ్డెక్కి ఘర్షణ పడ్డాయని అన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ ఆధ్వర్యంలోనే ఈ అక్రమ మైనింగ్ సాగుతోందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ గుంతల్లో పడి ఇప్పటివరకు ఏడుగురు పిల్లలు చనిపోయారని దుయ్యబట్టారు. ఈ కుటుంబాలను ఆదుకునే చర్యలేవీ ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. పల్నాడులో 14 మంది తెదేపా కార్యకర్తలు ఇప్పటివరకు అక్రమ మైనింగ్ మాఫియాకు బలయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్, మద్యం, ఫ్యాక్షన్ మాఫియాలు సాగుతున్నాయని ఆరోపించారు.

బుద్దా వెంకన్న: విశాఖలో గంటకో ఘోరం, అరగంటకో భూ కబ్జాకు వైకాపా నేతలు పాల్పడుతున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. 420 పార్టీలో విజయసాయి, కొడాలి నాని లాంటి వాళ్లు 840లుగా ఉన్నారని విమర్శించారు. విశాఖలో వృద్దాశ్రమ భూముల్నీ వైకాపా నేతలు వదలట్లేదని మండిపడ్డారు. విశాఖలో వైకాపా సాగించిన భూ కబ్జా బాధితుల కోసం ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే తెదేపా నిజనిర్ధారణ కమిటీ విశాఖలో పర్యటించి హాయగ్రీవ వృద్దాశ్రమ భూముల కబ్జాను పరిశీలిస్తుందని వెల్లడించారు. వైకాపా అక్రమాలపై తెదేపా నిజ నిర్ధారణ కమిటీ వేస్తుంటే.. లింగ నిర్ధారణేేమో అని కొడాలి నాని కంగారుపడుతున్నారని ఎద్దేవా చేశారు.

తెదేపా నేతలు

ఇవీ చదవండి:

Last Updated : Aug 21, 2022, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details