'అసహనం పక్కనపెట్టి పనిపై దృష్టి పెడితే...పరిస్థితులు మెరుగుపడతాయి' - ఏపీ తాజా వార్తలు
TDP leaders on Naidupet incident: తిరుపతిలోనే సీఎం జగన్ మాట్లాడుతుండగానే నాయుడుపేటలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు తాళలేక చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లారని నారా లోకేశ్ అన్నారు. అసహనం పక్కన పెట్టి పనిపై దృష్టి పెడితే.. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయని హితవు పలికారు.
TDP leaders on Naidupet incident: కుళ్లు, కుతంత్రాలతో తెదేపా దుష్ప్రచారం చేస్తుందని మాట్లాడటం వల్ల జగన్, వైకాపా నాయకులకు ఆత్మసంతృప్తి కలగొచ్చేమో కానీ... ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తెదేపాపై సీఎం జగన్ అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై సొంత ఊరికి తీసుకెళ్లాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది.. వైకాపా ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. అసహనం పక్కన పెట్టి పనిపై దృష్టి పెడితే కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయని లోకేశ్ హితవు పలికారు.