తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ బొడ్డు భాస్కర రామారావు మృతిపట్ల.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, జడ్పీ చైర్మన్ గా ప్రజలకు విశేషమైన సేవలందించారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం కృషి చేశారన్నారు. భాస్కర్ రావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
బొడ్డు భాస్కర రామారావు మృతిపట్ల తెదేపా నేతల సంతాపం - nara lokesh condolences to boddu bhaskar
తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ బొడ్డు భాస్కర రామారావు మృతిపట్ల.. తెదేపా అధినేత చంద్రబాబు, పలువురు పార్టీ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

బొడ్డు భాస్కర రామారావు మృతిపట్ల తెదేపా నేతల సంతాపం