ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బుద్దాపై కేసు కుట్రపూరితం.. వెంటనే విడుదల చేయాలి - తెదేపా - ap latest news

తెదేపా నేత బుద్ధా వెంకన్న అరెస్టును.. పార్టీ నేతలు ఖండించారు. గుడివాడ‌లో కొడాలి నాని క్యాసినో న‌డిపినప్పుడు.. గ‌డ్డం గ్యాంగ్ ప్రతిప‌క్ష నేత‌ని బూతులు తిట్టినప్పుడు పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. బుద్దాపై కేసు కుట్రపూరితమని.. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TDP leaders condemned on buddha venkanna arrest
బుద్ధా వెంకన్న అరెస్టును ఖండించిన తెదేపా నేతలు

By

Published : Jan 24, 2022, 7:46 PM IST

Updated : Jan 24, 2022, 8:29 PM IST

తెదేపా నేత బుద్దా వెంకన్న అరెస్టును.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. బుద్దాపై కేసు కుట్రపూరితమన్న ఆయన.. అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి క్యాసినోపై ప్రశ్నించిన తెదేపా నేతలను అరెస్టు చేస్తారా అని ధ్వజమత్తారు. ఏం జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడటం లేదు.. దాడి చేసినవారిని వదిలిపెట్టి.. నిలదీసిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చెయ్యడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. తప్పు చేసిన పోలీసులు విచారణ ఎదుర్కొనక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

అప్పుడు పోలీసులెక్కడున్నారు..

గుడివాడ‌లో కొడాలి నాని క్యాసినో న‌డిపినప్పుడు.. గ‌డ్డం గ్యాంగ్ ప్రతిప‌క్ష నేత‌ని బూతులు తిట్టినప్పుడు పోలీసులు ఎక్కడున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిలదీశారు. చంద్రబాబు ఇంటి పై దాడి చేసినప్పుడు పోలీసులు లేరని విమర్శించారు. తెదేపా కేంద్ర కార్యాల‌యాన్ని వైకాపా మూక‌లు ధ్వంసం చేస్తే.. పోలీసులు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు ప్రజార‌క్షణ‌కి ఉన్నారా లేక నేరాలు చేసే వైకాపా నేత‌లకు కాప‌లా కాస్తున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుద్ధా వెంక‌న్న అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

క్యాసినో వ్యవహారంపై తెదేపా నేతలు ఫిర్యాదు చెయ్యడానికి వెళితే కనీసం డీజీపీ అనుమతించలేదని మండిపడ్డారు. డీజీపీ వైకాపాలో చేరితే వాటాల్లేకుండా వాళ్లే క్యాసినో నడుపుకోవచ్చని ఎద్దేవా చేశారు.

బూతుల మంత్రిపై ఒక్క కేసైనా పెట్టారా..?: అచ్చెన్నాయుడు

చంద్రబాబును అనేక రకాలుగా తిడుతున్న బూతుల మంత్రిపై.. పోలీసులు ఒక్క కేసైనా పెట్టారా అని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. బూతులు తిట్టిన మంత్రులను, వైకాపా ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు. బుద్ధా వెంకన్న అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుద్ధా పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుని, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.కొడాలి నాని వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఆయన్ను పోలీసులు వివరణ అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలతో పాటు పోలీసుల అక్రమ కేసులపై తెదేపా పోరాడాల్సి వస్తోందన్నారు. పోలీసుల అక్రమ కేసులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

కుల అహంకార ధోరణికి బుద్దా వెంకన్న అరెస్ట్ ఒక ఉదాహరణ

బుద్దా వెంకన్న అరెస్టును.. తెదేపా నేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఖండించారు. సీఎం జగన్.. కుల అహంకార ధోరణికి బుద్దా వెంకన్న అరెస్ట్ ఒక ఉదాహరణ అని ధ్వజమెత్తారు. పోలీసులు తమ నెత్తి మీద మూడు సింహాలకు బదులుగా మూడు ఫ్యాన్ రెక్కలు పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు పోలీసుల దౌర్జన్యం తోడయిందని దుయ్యబట్టారు. సమాజంలో అల్లర్లు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న వైకాపా గుండాలను వదలి.. తెదేపా నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొడాలి నానిపై.. ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో ఎంతమంది వైకాపా నేతల్ని అరెస్ట్ చేసారని నిలదీశారు.

ఇదీ చదవండి:

Buddha Venkanna Arrest: కొడాలి నాని, డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు.. బుద్దా వెంకన్న అరెస్ట్

Last Updated : Jan 24, 2022, 8:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details