ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Condemn: ఆంధ్రాలో ఉన్నామా? అఫ్గాన్‌లో ఉన్నామా?: తెదేపా - tdp leaders condemned attack by ycp at chandrababu house

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్ధం కావడం లేదని తెదేపా నేతలు అన్నారు. అధికార పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలతో పోల్చితే అయ్యన్న చేసిన వ్యాఖ్యలు ఒక శాతం కూడా లేవని వారన్నారు. జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక రౌడీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికే రక్షణ లేకపోతే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని విమర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

tdp leaders condemned attack by ycp on chandrababu residence
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్ధం కావడం లేదు: తెదేపా నేతలు

By

Published : Sep 17, 2021, 7:51 PM IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్ధం కావడం లేదు: తెదేపా నేతలు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట గలిసింది. రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? అధికార పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలతో పోల్చితే అయ్యన్న చేసిన వ్యాఖ్యలు ఒక శాతం కూడా లేవు. వైకాపా నేతల భాషపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం జగన్(cm jagan) క్షమాపణలు చెప్పిన తర్వాత.. అయ్యన్న వ్యాఖ్యలపై ఆలోచిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే గృహ నిర్బంధాలు చేస్తున్న పోలీసులు.. హెచ్చరించి వెళ్లిన వ్యక్తిని ఎందుకు అడ్డుకోలేదు? ఆంధ్రాలో ఉన్నామా? అఫ్గాన్‌లో ఉన్నామా? తెలియడం లేదు. అరాచక పాలన సాగిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సమస్యలపై తెదేపా పోరాటం ఆగదని తెదేపా నేతలు అన్నారు.

వైకాపా నేతల దాడిని ఖండించిన అచ్చెన్న, సోమిరెడ్డి

తెదేపా అధినేత చంద్రబాబు నివాసం దగ్గర పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రాన్ని అఫ్గానిస్థాన్‌లా మార్చేశారు

సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అఫ్గానిస్థాన్‌లా మార్చేశారని ధ్వజమెత్తారు. జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక రౌడీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు తాలిబన్లను మించిపోయారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయనే దానికి తాజా ఘటనే నిదర్శనమన్నారు.

జగన్‌ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ

జగన్‌ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ అని.. దూళ్లిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, జీవి ఆంజనేయులు దుయ్యబట్టారు. పోలీసులు వైకాపా నేతలకే వత్తాసు పలికారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ దగ్గరుండి వైకాపా నాయకులను చంద్రబాబు ఇంటి వద్దకు పంపారని నేతలు ఆరోపించారు.

మాజీ సీఎంకే రక్షణ లేకపోతే సామాన్యుల స్థితి ఏంటి: జేసీ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని ఎమ్మెల్యే జోగి రమేష్ ముట్టడి చేపట్టిన సంఘటనను.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికే రక్షణ లేకపోతే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సంఘటనతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కొనసాగుతోందో అర్థమవుతోందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చూసుకోవాలని జేసీ హితవు పలికారు.

వైకాపా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది: కాలవ శ్రీనివాసులు

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. వైకాపా ఆగడాలకు అంతే లేకుండా పోతోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని ఎమ్మెల్యే జోగి రమేష్ ముట్టడించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర డీజీపీ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు.

నారా లోకేశ్​ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అడ్డుకొని అరెస్ట్ చేశారన్నారు. దీన్నిబట్టి పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని తెలుస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ఎమ్మెల్యేలను పార్టీల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం ఉందొ లేదో అర్ధం కావడం లేదు: కొల్లు రవీంద్ర

తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై.. వైకాపా నేతల దాడిని తెదేపా నేత కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందొ లేదో అర్ధం కావడం లేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే జోగి రమేష్ వైకాపా గుండాలను తీసుకుని చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లడం ఏంటని నిలదీశారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన వారిని తెదేపా కార్యకర్తలు అడ్డుకుంటే.. వారిపై వైకాపా గుండాలు విచక్షణారహితంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 10 లక్షల పెన్షన్లు తొలగించిన ప్రభుత్వం.. మీడియా, ప్రజల దృష్టిని మళ్లించేందుకే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వస్తే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: చినరాజప్ప

వైకాపా నేతలు.. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిని ముట్టడించిన తీరును.. తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఖండించారు. వైకాపా నాయకులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైకాపాకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే.. గ్రహించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

రౌడీలుగా చెలరేగిపోతున్నారు: వంగలపూడి అనిత

వైకాపా నాయకులు రౌడీలుగా రాష్ట్రంలో చెలరేగిపోతున్నారని.. తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

సంబంధిత కథనాలు:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details