ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేతల అరెస్టులపై మానవ హక్కుల కమిషన్​కు తెదేపా ఫిర్యాదు - తెదేపా నేతల అరెస్టు వార్తలు

జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టుల తీరును కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

tdp leaders complaint to nhrc
tdp leaders complaint to nhrc

By

Published : Jun 17, 2020, 8:47 AM IST

అచ్చెన్నాయుడు అరెస్టు తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్​కు టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్​ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్టుల తీరుపై ఎమ్మెల్సీ శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ప్రతీకార చర్యలతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అరెస్టు అమానుషమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కమిషన్​కు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details