ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్ మంత్రివర్గం.. ఛాయ్, బిస్కెట్ కేబినెట్'

TDP Leader on Jagan Cabinet: ముఖ్యమంత్రి కేబినెట్​పై తెదేపా నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రివర్గం.. ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అంటూ తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. జగన్​ మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ లేదని విమర్శించారు. తెదేపా ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాతినిధ్యం, ప్రాధాన్యత వచ్చిందని స్పష్టంచేశారు.

ఏపీ కొత్త కేబినేట్​పై తెదేపా కామెంట్స్​
TDP leaders on ap new cabinet

By

Published : Apr 12, 2022, 4:30 PM IST

ఏపీ కేబినెట్ ఏర్పాటుపై తెదేపా నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రివర్గం ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అంటూ.. యనమల ఎద్దేవా చేశారు. గత మంత్రివర్గం పప్పెట్ కేబినెట్ అయితే.. ఇప్పుడు ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కిచెన్ కేబినెట్‌లోనూ.. సలహదారుల బృందంలోనూ బీసీలు ఎందుకు లేరని ప్రశ్నించారు. నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ.. కిచెన్ కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత లేదని ఆరోపించారు. ప్రాధాన్యత, పెత్తనంలేని పదవులిచ్చి.. ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతున్నారని నిలధీశారు.

జగన్ కేబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదని యనమల విమర్శించారు. తెదేపా ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాతినిధ్యం, ప్రాధాన్యత వచ్చిందని ఆయన స్పష్టంచేశారు. చంద్రబాబు పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపిన తరువాతే నిర్ణయాలు తీసుకునేవారని గుర్తిచేశారు. జగన్ ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ డెమొక్రాటిక్ డిక్టెటర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో వైకాపా పట్ల వ్యతిరేకత ఉందన్న ఆయన.. వైకాపాలోనూ అసంతృప్తి మొదలైందన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలనే అందుకు నిరదర్శనం అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'కౌలురైతు భరోసా యాత్ర'.. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం

ABOUT THE AUTHOR

...view details