ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"మహారాష్ట్ర సీన్ ఇక్కడా రిపీట్.. అతడు సీఎం అవుతాడని జగన్​కు భయం" - వైకాపా ప్లీనరీపై తెదేపా నేతల కామెంట్స్

ఎన్నటికైనా తనను దించేసి.. ఓ మంత్రి సీఎం అవుతారనే భయం జగన్​కు పట్టుకుందని తెదేపా నేత బుద్ధా వెంకన్న అన్నారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలోనూ జరగనున్నాయని జోస్యం చెప్పారు.

మహారాష్ట్ర సీన్ ఇక్కడా రిపీట్
మహారాష్ట్ర సీన్ ఇక్కడా రిపీట్

By

Published : Jul 10, 2022, 4:47 PM IST

మహారాష్ట్ర సీన్ ఇక్కడా రిపీట్

వైకాపా ప్లీనరీ సర్కస్​ని తలపించిందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. రెండు రోజులపాటు జగన్ సర్కస్ నడిచిందని, సర్కస్​లో వివిధ రకాలైనటువంటి జంతువులు అంతా అక్కడికి చేరి విన్యాసాలు చేశాయని దుయ్యబట్టారు. 420, 840లు వైకాపా ప్లీనరీలో నటించారని విమర్శించారు. తనను ఎన్నటికైనా గద్దెదించి.. మంత్రి పెద్దిరెడ్డి సీఎం అవుతారనే భయం జగన్​కు పట్టుకుందని ఆరోపించారు. తల్లి విజయమ్మ చేత రాజీనామా చేయించి ఆమె చేత కన్నీళ్లు పెట్టించి సభనుంచి పంపించాడని అన్నారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఇక్కడ జరగనున్నాయని జోస్యం చెప్పారు.

జగన్​ను ఎందుకు నమ్మాలి ?: వైఎస్సార్ భార్య విజయమ్మ, కూతురు షర్మిల, ఆత్మ కేవీపీ, నీడ సూరీడు జగన్ రెడ్డిని నమ్మనప్పుడు.. ప్రజలెందుకు నమ్మాలని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. మ‌రో చెల్లి సునీత సీఎం జగన్ ముఖం చూడ‌టానికి కూడా ఇష్టప‌డ‌టం లేదని విమర్శించారు. ఆత్మస్తుతి, పరనింద తప్ప ప్లీనరీలో ఏముందని దుయ్యబట్టారు. 95 శాతం హామీలు అమలు చేశామని డ‌బ్బాలు కొట్టుకుంటున్నా.. వాటిల్లో ఒక్కటీ నిజం లేదని మండిపడ్డారు. బ‌టన్ నొక్కుతున్నాను అని చెప్పే జ‌గ‌న్ నేడు రివ‌ర్స్ బ‌ట‌న్ నొక్కి రూ 7,500కోట్లు పంచాయ‌తీల నిధులతోపాటు ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము లాగేశాడని ఆరోపించారు. వైసీపీ జ‌గ‌న్మోహ‌న్​రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిందని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details