వైకాపా బెదిరింపులు, దాడులు హేయమైన చర్యగా నూజివీడు తెదేపా ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను బెదిరించి భయపెట్టడం దారుణమని తెదేపా కార్యాలయంలో మండిపడ్డారు. మున్సిపాలిటీలో తెదేపా విజయం వైకాపా కళ్ళకు కనిపించడంతో, బెదిరింపులకు తెగబడ్డారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా జరిగే ఏకగ్రీవాలు సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించిన ఆయన అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే డీఎస్పీ, సీఐలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి కోరుకునే ప్రతి ఒక్కరూ..
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలు.. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన అంశమని తెదేపా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామమోహనరావు అన్నారు. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పు భావితరాల భవిష్యత్ మార్పునకు నాంది కావాలన్నారు. అమరావతి కోరుకునే ప్రతి ఒక్కరూ.. ఓటుతో వైకాపాకు గుణపాఠం చెప్పాలని కోరారు. 15వ డివిజన్ తెదేపా అభ్యర్థిని రత్నం రజినీ తరుపున ఇంటింటి తిరిగి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంచూతూ.. తెదేపాకు ఓటు వేసి.. రత్నం రజినీని గెలిపించాలని కోరారు.
ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయం..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో తెదేపా వైకాపా అభ్యర్థులు జోరు పెంచారు. వైకాపా అభ్యర్థుల తరుపున ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెదేపా తరుపున మాజీ ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే కనిపించే వైకాపా అభ్యర్థులతో నగర అభివృద్ధి అసాధ్యమన్నారు.
నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపాను గెలిపించాలి..