విద్యుత్ ఛార్జీల పెంపు... జగన్ అసమర్థతను తెలియజేస్తోందని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. చంద్రబాబు గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. 60 రోజులు పనులు లేక ప్రజలు కష్టాల్లో ఉంటే.. జగన్ కరోనా కానుకగా కరెంటు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. కరెంటు బిల్లులును రద్దు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బొండా హెచ్చరించారు.
పెంచిన కరెంట్ బిల్లులు ఎవరూ చెల్లించొద్దు: బొండా - జగన్పై బొండా ఉమా విమర్శలు న్యూస్
పెంచిన కరెంట్ బిల్లులను ఎవ్వరూ చెల్లించొద్దని తెదేపా నేత బొండా ఉమా పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
tdp leaders bonda uma fires on jagan