ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

33చోట్ల నామినేషన్ల తిరస్కరణ : ఎస్‌ఈసీకి తెదేపా ఫిర్యాదు - tdp leader ashoke babu news

పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ తెదేపా.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైకాపాతో అధికారులు కుమ్మక్కయ్యారని.. గెలిచిన తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను రీకౌంటింగ్​ పేరుతో ఓటమి చెందినట్లు ప్రకటించారని తెదేపా ఆరోపించింది.

tdp-leaders-ashokbabu-and-raja-complaint-sec-on-panchayathi-elections
33చోట్ల నామినేషన్ల తిరస్కరణ : ఎస్‌ఈసీకి తెదేపా ఫిర్యాదు

By

Published : Feb 14, 2021, 8:14 PM IST

Updated : Feb 15, 2021, 3:51 AM IST

నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని 33 పంచాయతీల్లో తెదేపా మద్దతుదారుల నామినేషన్లు సక్రమంగా ఉన్నప్పటికీ అధికారులు తిరస్కరించారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి బెదిరింపులకు తలొగ్గి ఉద్దేశపూర్వకంగానే అధికారులు నామినేషన్లను తిరస్కరించారని ఎస్‌ఈసీకి ఆదివారం లేఖ రాశారు. ‘వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు తెదేపా మద్దతుదారుల నామినేషన్లను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారోచెప్పలేదు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నామినేషన్లను తిరస్కరించడంతో అభ్యర్థులు అప్పీలు చేసుకునే చట్టబద్ధమైన హక్కు కోల్పోతున్నారు. తెదేపా మద్దతుదారులు వేసిన 33 నామినేషన్లు పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలి’ అని లేఖలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో ఎస్సై ఉదయ్‌బాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అతనిపై చర్య తీసుకోవాలని కోరారు.

Last Updated : Feb 15, 2021, 3:51 AM IST

ABOUT THE AUTHOR

...view details