విజయవాడలోని తెదేపా నేత పట్టాభి నివాసం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావారణం చోటు చేసుకుంది. సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ధ్వంసమైన కారుతోనే బయల్దేరిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని, బొండా ఉమ, బుద్దా వెంకన్నతోపాటు ఇతర నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. వీరంతా సీఎం నివాసం వద్దకు వెళ్లే అవకాశం ఉన్నందున ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టాభి నివాసం నుంచి ఆయనను ఈఎస్ఐ ఆసుపత్రికి పోలీసులు తరలిస్తుండగా..మహానాడు రోడ్డు వద్ద పట్టాభిని తరలిస్తున్న వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. తామే ఆస్పత్రికి తీసుకెళ్తామని ఆందోళన చేశారు. వారిని నిలువరించి పట్టాభిని పోలీసులు ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు.