ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిబంధనలకు విరుద్ధంగా సుబ్బారెడ్డికి ఇంజినీర్ ఇన్ చీఫ్ పదవి' - ఇంజినీర్ ఇన్ ఛీఫ్ పోస్టుపై వివాదం వార్తలు

నిబంధనలకు విరుద్ధంగా జగన్ సామాజిక వర్గానికి చెందిన సుబ్బారెడ్డికి ఇంజినీర్ ఇన్ చీఫ్ పదవి కట్టబెట్టారని తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. అలాంటి ఉత్తర్వులు.. ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

'నిబంధనలకు విరుద్ధంగా సుబ్బారెడ్డికి ఇంజినీర్ ఇన్ చీఫ్ పదవి'
'నిబంధనలకు విరుద్ధంగా సుబ్బారెడ్డికి ఇంజినీర్ ఇన్ చీఫ్ పదవి'

By

Published : Jun 12, 2021, 3:12 PM IST

ప్యానెల్ జాబితాలో జూనియర్​గా ఉన్న సుబ్బారెడ్డికి సర్వీస్ కోడ్ నియమావళికి విరుద్ధంగా ఇంజినీర్ ఇన్ చీఫ్​గా వేతనం తీసుకునేలా పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయటంపై తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలో కీలక బాధ్యత పోషించే ఇంజినీర్ ఇన్ చీఫ్ పదవిని విశ్రాంత ఉద్యోగికి అడ్డగోలుగా కట్టబెట్టాల్సిన అవసరమేంటని నిలదీశారు. నిధులను దారి మళ్లించేందుకే అడ్డదారిన పదవి ఇచ్చారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇంజినీర్లకు అన్యాయం చేసేలా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా అన్యాయానికి గురవుతున్న ఎస్సీలు వైకాపా పాలనలో మోసాన్ని గ్రహించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details