ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబుపై ఫిర్యాదు చేయడం వైకాపా నేతల అజ్ఞానానికి నిదర్శనం' - వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డికి తెదేపా నేత మద్దిపాటి వెంకటరాజు లేఖ

ఎస్​ఈసీ పర్యటనను వైకాపా నేతలు తప్పుపట్టడంపై తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ స్పందించారు. అధికార పార్టీ నాయకులకు ఆందోళన మొదలై.. అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విడుదల చేసిన అభివృద్ధి ప్రణాళికపై ఫిర్యాదులు చేయడం.. వైకాపా నేతల అజ్ఞానానికి నిదర్శనమని సజ్జల రామకృష్ణారెడ్డికి తెదేపా ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు లేఖ రాశారు.

tdp leaders allegations on ysrcp
వైకాపాపై తెదేపా నేతల విమర్శలు

By

Published : Jan 30, 2021, 8:38 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లాల్లో పర్యటిస్తే తప్పేంటో వైకాపా నేతలు చెప్పాలని.. తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరాముడిని నిమ్మగడ్డ దర్శించుకోవటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రారంభంతో.. వైకాపాకు ఆందోళన మొదలైందని ఆరోపించారు. బలవంతపు ఏకగ్రీవాలు కుదరట్లేదు కాబట్టే.. చంద్రబాబును, ఎస్ఈసీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే లక్ష్యంతో చంద్రబాబు విడుదల చేసిన అభివృద్ధి ప్రణాళికను విమర్శించి, ఫిర్యాదులు చేయడం.. వైకాపా నేతలకు చట్టాలపై ఉన్న అజ్ఞానికి నిదర్శనమని తెదేపా ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అధికారం చేపట్టిన 20నెలల్లో గ్రామీణాభివృద్ధి కోసం చేసింది చెప్పుకోలేకే.. తెదేపా హయాంలో చేసినదాన్ని కప్పిపెట్టే దురుద్దేశం కనిపిస్తోందని ఆరోపించారు. ఎలక్టోరల్ హక్కుకు భంగం కలుగకుండా.. ప్రజా సంక్షేమ ప్రణాళికను ప్రకటించడం నేరం కాదని పంచాయతీరాజ్ చట్టం స్పష్టం చేస్తోందని వివరించారు. అస్సోం సీఎం సహా వివిధ రాష్ట్రాల్లోనూ అభివృద్ధి ప్రణాళికను విడుదల చేశారని గుర్తు చేశారు. సజ్జల లాంటి సలహాదారుల వల్లే రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతిందని దుయ్యబట్టారు.

సజ్జల రామకృష్ణారెడ్డికి తెదేపా నేత మద్దిపాటి లేఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details