ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP leader Yanamala జగన్​ పాలన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందన్న యనమల - TDP leader Yanamala on cps protest

TDP leader Yanamala ఉద్యోగులను బైండోవర్ చేయడం అనాగరిక చర్య అని తెదేపా నేత యనమల మండిపడ్డారు. జగన్ పాలన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ఉద్యోగులు తమ నిరసన తెలుపుకునే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా జగన్ చర్యలు ఉన్నాయన్నారు.

TDP leader Yanamala
యనమల

By

Published : Aug 29, 2022, 12:25 PM IST

TDP leader Yanamala సీఎం జగన్​ పాలన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఉద్యోగులను బైండోవర్‌ పరిధిలోకి తీసుకోవడం అనాగరిక చర్యని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారి శాంతియుత ఆందోళనను పోలీసులతో అణచివేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఉద్యోగులు తమ నిరసన తెలిపే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా జగన్​ చర్యలున్నాయని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details