YANAMALA :రాష్ట్రం సంక్షేమంలో ముందుందని కోతలు కోస్తున్న ప్రభుత్వం..డీబీటీలో ఏపీ 19వ స్థానంలో ఎందుకుందో చెప్పాలని... తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నిలదీశారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు 34 శాతం నుంచి 43 శాతానికి ఎందుకు పెరిగాయో చెప్పాలన్నారు. మూల ధన వ్యయం 19 వేల 976కోట్ల నుంచి 14వేల కోట్ల రూపాయలకు ఎందుకు పడిపోయిందో చెప్పాలన్నారు.
YANAMALA: మూడేళ్లలో రూ.3.71 లక్షల కోట్ల అప్పు..తిరోగమనంలో ఆర్ధిక వృద్ది - tdp leader yanamala latest news
YANAMALA: రాష్ట్రం సంక్షేమంలో ముందుందని తుపాకీరాముడి కోతలు కోస్తున్న ప్రభుత్వం..సంక్షేమమే బాగుంటే డీబీటీలో ఏపీ 19వ స్థానంలో ఎందుకుందో మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు నిలదీశారు. పేదరికంలో ఏపీ 20వ స్థానంలో ఎందుకుందని ప్రశ్నించారు.
తెలుగుదేశం హయాంలో రాష్ట్ర వృద్ధిరేటు 10.22 శాతం ఉండగా ఇప్పుడు మైనస్ 2.58 శాతానికి రివర్స్ చేశారని, రెండంకెల వృద్ధి నుంచి తిరోగమన వృద్ధికి ఎందుకు దిగజారిందో సమాధానం చెప్పాలన్నారు. తలసరి ఆదాయం వృద్ధి ఎందుకు సింగిల్ డిజిట్‌కు పడిపోయిందని ప్రశ్నించారు. ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదని మంత్రి చెప్పడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. మూడేళ్లలో రాష్ట్ర ఆదాయం పెరిగిందని యనమల తెలిపారు. వైకాపా ప్రభుత్వం మూడేళ్లలో రూ.3,71,756 కోట్లు అప్పుచేసిందన్న యనమల ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను ఉల్లంఘించారని మండిపడ్డారు. అప్పుల మొత్తం 7లక్షల 30వేల 593కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయాయని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: