వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ ప్రభుత్వం ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ధరలు మూడు రెట్లు పెంచటంతో పాటు పెట్రోల్, డీజిల్.. ధరలు ఒక లీటరుకు రాష్ట్రం అదనంగా రూ.5 పెంచిందన్నారు. కొత్త ఆస్తిపన్ను చట్టం ప్రకారం ఇప్పుడు ఇంటిపన్ను రూ.10 వేలు చెల్లించే వారు ఏప్రిల్ నుంచి రూ.50 వేలు చెల్లించాల్సి వస్తుంది. ఎడాపెడా ధరలు, పన్నులు, అప్పులు పెంచినా అభివృద్ధి శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తేనే ఇకపై భారాలు పెంచడానికి భయపడతారని ప్రజల్ని కోరారు.
'ఇచ్చింది గోరంత.. దోచుకునేది కొండంత' - tdp comments on cm jagan
రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సీఎం జగన్ రూ.2.50 లక్షల భారం మోపారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. గోరంత ఇస్తూ కొండంత దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. గడచిన 20 నెలల్లో ప్రభుత్వం తెచ్చిన అప్పులకు రెవెన్యూ రాబడులకు పొంతన లేదని ఆక్షేపించారు. మద్యం మాఫియాలో జె-ట్యాక్స్ కింద ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.25వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారని యనమల ఆరోపించారు.

tdp leader yanamala ramkrihsnudu comments on financial condition of state
TAGGED:
tdp comments on cm jagan