వైకాపా 20నెలల పాలనలో.. పట్టణ ప్రాంతాల్లో అసలు అభివృద్ధే లేదన్న విషయం.. ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. గత రెండు బడ్జెట్‌లలో నగరాల అభివృద్ధికి కేటాయింపులకు, వాస్తవంలోని ఖర్చులకు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేముందు ఈ విషయాలన్నీ ప్రజలు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
వైకాపా పాలనలో నేతల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజల ఆస్తులు పెరగలేదన్నారు. రెండు ఆర్ధిక సంవత్సరాల్లో కేటాయింపులకు తగ్గ ఖర్చులు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ అంచనాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదని ధ్వజమెత్తారు. పురపాలక ఎన్నికల్లో గెలిపిస్తే.. తెదేపా మేనిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలను నెరవేర్చుతామని చెప్పారు.