వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణులకు ఏం ఒరగబెట్టిందో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ వ్యతిరేకి కాబట్టే ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2019-20, 2020-21 బడ్జెట్లలో బ్రాహ్మణులకు కేటాయించిన రూ. 244కోట్లను ఎవరికి, ఎందుకు ఖర్చుపెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. రమణదీక్షితులకు, ఆయన కుటుంబానికి మేలు చేస్తే.. బ్రాహ్మణులందరికీ న్యాయం చేసినట్లా అని నిలదీశారు.
'రమణదీక్షితులకు మేలుచేస్తే...బ్రాహ్మణులందరికీ న్యాయం జరిగినట్లా?'
రెండేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణులకు ఏం చేసిందో కోన రఘుపతి, మల్లాది విష్ణు చెప్పాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు.
వేమూరి ఆనంద్ సూర్య
తెదేపా ప్రభుత్వంలో బ్రాహ్మణులకు జరిగిన మేలుపై ఆధారాలు, అంకెలతో సహా చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం లక్షా 62వేల బ్రాహ్మణ కుటుంబాలకు న్యాయం చేసిందని, తనతో చర్చకు రావడానికి కోన రఘుపతి, మల్లాది విష్ణులు సిద్ధమా అని సవాలు విసిరారు. రాష్ట్రంలో వైకాపాలో బ్రాహ్మణ నేతలే లేరన్నట్లు మల్లాది విష్ణుకి మూడు పదవులిస్తారా అని నిలదీశారు.
ఇదీ చదవండి:'ప్రజలు ప్రశ్నిస్తారనే.. సీఎం జగన్ తిరుపతి సభ రద్దు'