"తిరుపతి లోక్సభ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించడం ఆ పార్టీ నేతలందరినీ ఆత్మ పరిశీనలో పడేసింది నిజం కాదా?" అని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అనుసరించడం వల్లే ఈ గెలుపు లభించిందన్న విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు.
దొంగ ఓటర్ కార్డులు ఎక్కడ తయారు చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలుసునని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. వారిద్దరు లై-డిటెక్టర్ టెస్టుకు సిద్ధపడితే తిరుపతి లోక్సభ స్థానంలో గెలుపు ఎవరిదో అన్నది.. రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుందన్నారు. దొంగఓట్ల అంశం గురించి తమకు ఏమీ తెలియదని ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్దిరెడ్డి... తిరుపతి వెంకన్న సమక్షంలో ప్రమాణం చేసి చెప్పగలరా... అని సవాల్ చేశారు.