ప్రభుత్వ అసమర్థత వల్లే గుంటూరులో ఎస్సీ యువతి రమ్య హత్యకు గురైందని తెలుగుదేశం ఆరోపించింది. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఐదు ఎకరాల పొలం ఇవ్వాలని కోరారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకుంటే.. రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని వర్ల రామయ్య హెచ్చరించారు.
VARLA: 'రమ్య కుటుంబానికి రూ.కోటి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందే' - తెదేపా నేత వర్లరామయ్య తాజా వార్తలు
ప్రభుత్వ అసమర్థత వల్లే గుంటూరులో ఎస్సీ యువతి చనిపోయిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. రమ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
వర్ల రామయ్య