ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP: దగ్ధమైన బోటులో మత్తు పదార్థాలున్నాయి: వర్ల రామయ్య - కాకినాడ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాలిపోయిన బోటులో మత్తుపదార్ధాలు ఉన్నాయని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. నిజ నిర్ధారణకు వెళ్లిన నేతలపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

varla ramaiah
వర్ల రామయ్య

By

Published : Oct 6, 2021, 9:24 PM IST


తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జగన్నాథపురంలో ఇటీవల తగలబడిన(tdp leader varla ramaiah on boat burnt incident in kakinada) బోటులో హెరాయిన్ ఉన్నందువల్లే అందులోనుంచి తెల్లటి పొగ వచ్చిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై నిజనిర్ధారణ చేసేందుకు వెళ్లిన తెదేపా నేతల బృందంపై మాఫియా కింగ్ దాడి చేస్తే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు.

"తగలపడిన బోటులో ఏముందని తెదేపా నేతలు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా. దాడి చేస్తున్నవారిని పోలీసులు ఎందుకు నివారించలేదు. పోలీసుల పనితీరు అర్థవంతంగా లేదనడానికి తాజా సంఘటనే మరో ఉదాహరణ. దాడి జరుగుతుంటే చోద్యం చూసిన పోలీసులపై చర్య తీసుకోవాలి. ముందస్తు అరెస్టులు ప్రతిపక్షాలకే పరిమితమా. పోలీసులు జీ..హుజూర్ తీరుతో తెలుగు జాతి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నందున తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలి. జాతీయ దర్యాప్తు సంస్థతో (ఎన్ఐఏ) ప్రధాని విచారణ చేయించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో గంజాయి దొరకని ప్రదేశం లేదు. ఓ భస్మాసురుడిని ముఖ్యమంత్రిగా తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ నెత్తిని కొరివితో గోక్కున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి" - వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

ABOUT THE AUTHOR

...view details