ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VARLA LETTER TO NHRC: అక్రమ మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించండి: వర్ల రామయ్య - ఎన్​హెచ్​ఆర్​సీకి వర్ల రామయ్య లేఖ

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC)​ను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. అక్రమ మైనింగ్​ను అరికట్టడంతో పాటు రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల్ని కాపాడాలని కోరుతూ.. ఎన్​హెచ్​ఆర్​సీ ఛైర్మన్​ హెచ్.ఎల్. దత్తుకు లేఖ రాశారు.

VARLA LETTER TO NHRC
అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఎన్​హెచ్​ఆర్​సీకి వర్ల లేఖ

By

Published : Aug 4, 2021, 4:36 AM IST

జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపేలా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. అక్రమ మైనింగ్‌తో పాటు రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడేందుకు సమగ్ర విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్​ హెచ్.ఎల్. దత్తుకు లేఖ రాశారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయన్న వర్ల.. అటవీ చట్టాలకు విరుద్ధంగాను, పర్యావర హక్కులు ఉల్లంఘించేలా ఈ అక్రమమైనింగ్ సాగుతోందని ఆరోపించారు. రాజ్యాగం కల్పించిన జీవించే హక్కులో పర్యావరణ పరిరక్షణ ఓ భాగమని.. కొండపల్లి అటవీ ప్రాంతంలో అనేక జాతులకు చెందిన జంతుజాలం, వృక్షజాలం ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.

మైనింగ్ కోసం కొండపల్లి బొమ్మల తయారీకి ప్రసిద్ధి గాంచిన తెల్లపోని చెట్లను నరికి వేయటం బొమ్మల తయారీ జీవనోపాధికి ముప్పు ఏర్పడిందన్నారు. అక్రమమైనింగ్ తో ఇప్పటికే 200ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టమన్న వర్ల.. ఇందుకనుగుణంగానే మాజీ మంత్రి దేవినేని ఉమా జూలై 27 న అక్రమమైనింగ్​ను పరిశీలిస్తే వైకాపా గూండాలు ఆయనపై దాడి చేశారన్నారు. పోలీసులు అక్రమ మైనింగ్ పాల్పడుతూ దాడి చేసే వారిని అరెస్టు చేయకుండా దేవినేని ఉమాపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు తెదేపా నియమించిన నిజనిర్థారణ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా పోలీసులు వ్యవహరిస్తూ అక్రమమైనింగ్ ను కాపాడేందుకే కృషి చేస్తున్నారన్నది వారి చర్యలతో స్పష్టమైందని లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details