VARLA LETTER: సీఐడీ పోలీసులు చట్టపరమైన బాధ్యతలు మరిచి ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సైన్యంలా పనిచేస్తోందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. పోలీసులు రాజ్యాంగం ప్రకారం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐడీ (CID) ఏడీజీకి ఆయన లేఖ రాశారు. జూన్ 29 రాత్రి సంఘ విద్రోహుల్లా .. గోడ దూకి, తలుపులు పగులగొట్టి , అక్రమంగా పల్నాడు జిల్లా ధరణికోట వాసి గార్లపాటి వెంకటేశ్వరరావును అరెస్టు చేశారని మండిపడ్డారు. జూన్ 30న మోకరాల సాంబశివరావును అతని ఇంటి నుంచి బలవంతంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఐడీ ఇలానే వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలీసుల చేతిలో వేధింపులకు గురైన బాధితులకు సీఐడీ చీఫ్ క్షమాపణలు చెప్పేందుకు కూడా అర్హులు అని లేఖలో పేర్కొన్నారు.
VARLA LETTER: "జగన్ వ్యక్తిగత సైన్యంలా.. సీఐడీ పోలీసులు": వర్ల రామయ్య - latest news in ap
VARLA LETTER: సీఐడీ పోలీసులు.. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సైన్యంలా పనిచేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ మేరకు సీఐడీ (CID) ఏడీజీకి ఆయన లేఖ రాశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఐడీ ఇలానే వ్యవహరిస్తోందని ఆరోపించారు.
VARLA LETTER