ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేయాలి: వర్ల రామయ్య - sc classification

ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

వర్ల రామయ్య

By

Published : Jul 19, 2019, 10:14 PM IST

వర్ల రామయ్య మీడియా సమావేశం

సున్నితమైన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేలికగా తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రికి అవగాహన లేదని విమర్శించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన ఉషామెహ్రా కమీషన్​ను కూడా వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరణ చేసేలా కేంద్రంతో మాట్లాడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details