ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేస్తుంది ఆయనే..' - వర్ల రామయ్య మీడియా సమావేశం వార్తలు

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతోంది మంత్రి బొత్స సత్యనారాయణ అని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్నో ఇసుక లారీలకు బినామీగా ఉన్నారని విమర్శించారు.

వర్ల రామయ్య మీడియా సమావేశం

By

Published : Nov 10, 2019, 9:13 AM IST

మంత్రి బొత్స సత్యనారాయణపై తెదేపా నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నదే బొత్స అని ఆరోపించారు. ఆయనకు 50 ఇసుక లారీలు ఉన్నాయనీ.. ఇసుక రవాణా ఆధిపత్యం కోసం పాకులాడుతూ ఎంపీతో గొడవ పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నో ఇసుక లారీలకు బినామీగా ఉన్న బొత్స సత్యనారాయణ.. పోలీసులు ఇసుక లంచాలు తీసుకుంటున్నారని ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇసుక కొరతపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బలమైన పోలీసు బందోబస్తు చేయాలని సూచించారు.

వర్ల రామయ్య మీడియా సమావేశం

ABOUT THE AUTHOR

...view details