varla ramaiah fires on cm jagan: ఎస్సీలకు అబద్ధపు మాటలుచెప్పి, అసాధ్యపు వాగ్ధానాలు ఇచ్చి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఎస్సీలకు తాను మేనమామను అని ప్రకటించుకున్న జగన్.. ఇప్పుడు వారి విషయంలో కంస మామలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
జగన్ మేనమామ కాదు.. కంస మామ : వర్ల రామయ్య - ap latest news
varla ramaiah fires on cm jagan: ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెదేపా నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఆర్థికంగా దివాళా తీసిన వైకాపా ప్రభుత్వం.. దళితులను ఉద్ధరించడం అనేది ఎప్పటికీ సాధ్యంకాదని విమర్శించారు. ఎస్సీలకు తాను మేనమామను అని ప్రకటించుకున్న జగన్.. ఇప్పుడు వారి విషయంలో కంసుడిలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎస్సీలకు రూపాయి రుణం ఇవ్వకుండా.. ఎస్సీ కార్పొరేషన్ ను మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ లుగా విడగొట్టి, వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు అమలు చేసిన కులాంతర వివాహ ప్రోత్సాహకం పథకాన్ని రద్దు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా దివాళా తీసిన వైకాపా ప్రభుత్వం.. దళితులను ఉద్ధరించడం అనేది ఎప్పటికీ సాధ్యంకాదని అన్నారు. దళితుల అభివృద్ధి, వారి సంక్షేమం పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందా? అని నిలదీశారు.
ఇదీ చదవండి:
ఈ నెల 27న ప్రకాశం జిల్లాకు సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ