ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారి మరణాలకు.. కొడాలి నానికి.. సంబంధం ఏంటి ? - వర్ల - TDP Leader Varla Ramaiah fired on Kodali Nani

TDP Varla fired on Kodali Nani: గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైకాపా నేతలు, బావ బావమరుదులైన వంకా విజయ్, అడపా బాబ్జీ మరణాలకు మంత్రి కొడాలినానికి ఉన్న సంబంధమేంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.

TDP Leader Varla Ramaiah
TDP Leader Varla Ramaiah

By

Published : Mar 27, 2022, 7:26 PM IST

TDP Varla fired on Kodali Nani: గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైకాపా నేతలు, బావ బావమరుదులైన వంకా విజయ్, అడపా బాబ్జీ మరణాలకు.. మంత్రి కొడాలినానికి ఉన్న సంబంధమేంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. అడపా బాబ్జీ శవయాత్రలో మంత్రిని ఓ యువకుడు అడ్డగించి, బాబ్జీ చావుకు నువ్వేకారణమని నిలదీసింది నిజమా కాదా? అని వర్ల నిలదీశారు. 2015లో వంకావిజయ్ ఎందుకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని వర్ల ఘాటుగా ప్రశ్నించారు. వంకావిజయ్ మరణించినప్పుడు అతని జేబులోని సూసైడ్ నోట్ ఏమైందని అడిగారు. నోట్ తాలూకా రెండోకాపీ అతని బావ అడపాబాబ్జీకి చేరిన సంగతి నిజం కాదా? అని నిలదీశారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంచెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి, డీజీపీకి ఉందని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details