రాష్ట్ర గవర్నర్ ఇతర పార్టీల నేతలకు నేరుగా అపాయింట్మెంట్ ఇస్తూ... తమను మాత్రం తన కార్యదర్శిని కలవమంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వాపోయారు. గవర్నర్ ఉదాసీనంగా ఉండటం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తమకు ఎందుకు కలిసే అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
గవర్నర్ ఇలా ఉండటం మంచిది కాదు: వర్ల రామయ్య - గవర్నర్ రబ్బరు స్టాంపులా ఉండటం మంచిది కాదు: వర్ల రామయ్య
రాష్ట్ర గవర్నర్ ఉదాసీనంగా ఉండటం మంచిది కాదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గవర్నర్.. ఇతర పార్టీల నేతలకు నేరుగా అపాయింట్మెంట్ ఇస్తూ.. తమను మాత్రం కార్యదర్శిని కలవమంటున్నారని వాపోయారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మంత్రుల్లో కొందరు గ్రామ సింహాల్లా వ్యవహరిస్తూ.. ఎస్ఈసీ రమేశ్‌కుమార్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఎస్ఈసీని విమర్శించే అర్హత ఎక్కడిదని వర్ల రామయ్య నిలదీశారు. ఐఏఎస్‌గా 40ఏళ్ల అనుభవం ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు, మంత్రులకు పోలికేంటని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:
వైకాపా నేతలు నామినేషన్లు వేయనివ్వటం లేదని ఎస్ఈసీకి ఫిర్యాదు
TAGGED:
varla ramaiah latest news