ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అక్కడ జార్జ్ ఫ్లాయిడ్.. ఇక్కడ డాక్టర్ సుధాకర్' - డాక్టర్ సుధాకర్​పై మాట్లాడిన వర్ల రామయ్య

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్​కి జరిగిన విధంగానే... రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ విషయంలో జరుగుతోందని.. తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. సుధాకర్​పై వైకాపా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.

tdp leader varla ramaiah criticises ycp government on doctor sudhakar issue
వర్ల రామయ్య, తెదేపా నేత

By

Published : Jun 7, 2020, 1:54 AM IST

డాక్టర్ సుధాకర్ విషయంలో వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్, ఏపీలో సుధాకర్​పై పోలీసుల దమననీతి ఒకే విధంగా ఉందని ఆరోపించారు. అక్కడ ఫ్లాయిడ్ మెడపై కాళ్ళతో తొక్కారు.. ఇక్కడ సుధాకర్ చేతులు వెనక్కు విరిచి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితుల ప్రాథమిక హక్కులను జగన్ ఇనుప పాదాలతో తొక్కివేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్, డాక్టర్ రామిరెడ్డిల ఫోన్ కాల్స్ పరిశీలించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details