ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఓటర్లను పోలీసులే భయపెడుతున్నారు: వర్ల రామయ్య - తిరుపతి ఉప ఎన్నికపై సీఈవోకు ఫిర్యాదు చేసిన వర్ల

అధికార వైకాపా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ దౌర్జన్యాలకు పాల్పడుతోందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. అధికార పార్టీ అండతో తిరుపతి ఓటర్లను పోలీసులే భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్​కు ఫిర్యాదు చేశారు.

varla ramaiah complaint to ceo
తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య

By

Published : Apr 6, 2021, 6:55 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీ వ్యవహరిస్తోందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు. పోలీసులు.. తిరుపతి ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్​కు ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా పోటీ చేయడం లేదని పోలీసులే ఇంటింటికి వెళ్లి ఓటర్లకు చెబుతున్నారని.. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరినట్లు వర్ల తెలిపారు.

తిరుపతి పోలింగ్ సందర్భంగా ఓటర్ల క్యూలైన్లను నియంత్రించే బాధ్యతలనూ కేంద్ర బలగాలకే అప్పగించాలని వర్ల అభ్యర్థించారు. తిరుపతి లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో వ్యయ పరిశీలకులతో పాటు ఎన్నికల పరిశీలకులను నియమించాల్సిందిగా ఎన్నికల ముఖ్య అధికారిని కోరారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతి చోటా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details