మాజీ మంత్రి వివేకా హత్యకు నలబై కోట్ల సుపారీ ఇచ్చిన వారెవరో ముఖ్యమంత్రి జగన్‌కు తెలియదా? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla ramaiah comments On Viveka Murder case) ప్రశ్నించారు. హత్య కేసులో అసలు నిందితులు బయటపడతారనే భయంతోనే.. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయటానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు కొలిక్కివస్తున్న నేపథ్యంలో తాను కాపాడాలనుకుంటున్న ముద్దాయిలను సీబీఐ అరెస్టు చేస్తుందేమోనన్న అనుమానం జగన్‌లో మెుదలైందన్నారు.
చంద్రబాబు సతీమణిపై.. వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలపైనా వర్ల మండిపడ్డారు. "ఒక ముద్ద అన్నం పెడితే కుక్క చూపే విశ్వాసాన్ని కూడా శాసనసభలోని కొందరు నీచులు చూపటం లేదు. వారు అసలు మనుషులే కాదనే భావన కలుగుతోంది. ప్రతి మహిళా ఈ దుర్మార్గుల తీరుపై ఆలోచించాలి. చట్టాలు చేసే నైతిక విలువ ఈ సభకు ఉందా?" అని అన్నారు.