స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక అధికారుల్ని (Special officers at counting centers) నియమించాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల సిబ్బంది, పోలీసు అధికారులు సిగ్గుపడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల సిబ్బందిపై నమ్మకం లేకనే న్యాయస్థానం ప్రత్యేకాధికారుల్ని నియమించిందన్నారు. న్యాయస్థానం నిర్ణయం ఎస్ఈసీ (SEC), పోలీస్ శాఖ పనితనాన్ని తప్పుపట్టినట్లైందని ఎద్దేవా చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ వెబ్ కాస్టింగ్‌పై (Web Costing) నమ్మకం లేక తాము ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి, వైకాపా పాలకుల అరాచకాలు అన్ని రోజులూ సాగవని హెచ్చరించారు. రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తారని నైజీరియన్ జర్నలిస్టు రాష్ట్ర పరిస్థితుల్ని గమనించే బ్లాగ్ (Blog) పెట్టారన్నారు. సాధారణ దొంగల్ని వెంటాడి పట్టుకునే పోలీసులు..,రాజకీయ దొంగలకు మాత్రం రక్షణ కల్పిస్తూ జీ హుజూర్ అంటున్నారని ఆరోపించారు.
హైకోర్టు ఏం ఆదేశించిందంటే..