ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Varla Ramaiah కుప్పంను ఆక్రమించుకోవాలనుకోవడం పెద్దిరెడ్డికి పగటికలే - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

TDP leader Varla Ramaiah కుప్పంను ఆక్రమించుకోవాలనుకోవడం మంత్రి పెద్దిరెడ్డికి పగటికలే అవుతుందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఎంత అణగదొక్కితే రెట్టింపు వేగంతో ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు.

Varla Ramaiah
వర్ల రామయ్య

By

Published : Aug 27, 2022, 3:52 PM IST

TDP leader Varla Ramaiah కుప్పంను ఆక్రమించుకోవాలనుకోవడం పెద్దిరెడ్డికి పగటికలగానే మిగులుతుందని గుర్తుంచుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య చెప్పారు. ఎంతగా అణగదొక్కుతారో రెట్టింపు వేగంతో వైకాపాను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. కుప్పం ఘటనలో 7 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేస్తే 6 ఎఫ్​ఐఆర్​లు తెదేపా వారిపైనే పెట్టారని మండిపడ్డారు. వీటిలో 3 ఎఫ్​ఐఆర్​లు హత్యాహత్నానికి సంబంధించినవి అని అన్నారు. అసలు వైపాపాకు ఎఫ్​ఐఆర్​లు అంటే తెలుసా అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో పోలీసు వ్యవస్థ ఎటుపోతుందో అర్థంకావడం లేదన్నారు. కుట్ర వెనుక ఉన్న పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్​పై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"కుప్పంను ఆక్రమించుకోవాలనుకోవడం పెద్దిరెడ్డికి పగటికలే. ఎంత అణగదొక్కితే రెట్టింపు వేగంతో ప్రజలు తిప్పికొడతారు. కుప్పం ఘటనలో ఏడింటిలో 6 కేసులు తెదేపా నేతలపైనే. వైకాపా పాలనలో పోలీసు వ్యవస్థ ఎటుపోతుందో అర్థంకావట్లేదు. కుట్ర వెనుక ఉన్న పెద్దిరెడ్డి, భరత్‌పై చర్యలు తీసుకోవాలి." -తెదేపా వర్ల రామయ్య


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details