ముఖ్యమంత్రి జగన్ (cm jagan) నివాసానికి కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం (gang rape) సిగ్గుచేటని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (anitha) దుయ్యబట్టారు. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా..నిందితులను పట్టుకోకపోవడం ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమన్నారు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ఎక్కడున్నారో ఆచూకీ తెలియటం లేదని ఎద్దేవా చేశారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్ (gun) కంటే ముందే వస్తానన్న జగన్ ఎందుకు రావటం లేదని అనిత నిలదీశారు.
ఇన్ని ఘటనలు జరిగితే కనీసం ఒక్కసారైనా స్పందించడానికి మీకు మనసు రాలేదా ? అని సీఎం జగన్ను ఆమె ప్రశ్నించారు. జగన్ చేతిలో ఉన్న రిమోట్ ఆన్ అయ్యే వరకు హోంమంత్రి(home minister) స్పందించరా ? అని విమర్శించారు. దిశ చట్టం ద్వారా నిందితులను శిక్షిస్తున్నామని ప్రచారాలు చేసుకోవటం సిగ్గుచేటన్నారు. రాజన్న రాజ్యం అంటూ ప్రజలకు రాక్షస రాజ్యాన్ని చూపిస్తున్నారని అనిత ఆక్షేపించారు.