దీపావళి పండగ రోజు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం గంజి అన్నం తప్ప మరోటి లేకుండా చేసిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు తారాజువ్వల కన్నా ఎత్తుకు చేరితే, విద్యుత్ బిల్లులు దీపాలు పెట్టుకోకుండా వణికించాయన్నారు. పెరిగిన ధరలు నూనె దీపం ఆలోచననూ దూరం చేసినా.. జగన్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ సామాన్యుల పాలిట కర్కశత్వం చాటుకుందని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం హయాంలో ఆకలి అనే మాట లేకుండా చేసిన అన్న క్యాంటీన్లను మూసేశారని విమర్శించారు. ధరల నియంత్రణలో నిద్ర నటిస్తూ సామాన్యుల నడ్డి విరిచారని.. దీనికోసం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని నాశనం చేశారని ఆరోపించారు. స్వామీజీలకు ప్రత్యేక పూజలు చేయడంపై ఉన్న శ్రద్ధ సామాన్యుల ఆకలి కేకలపై లేకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.