జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ఆడబిడ్డకు కష్టమొస్తే గన్ను కంటే ముందొస్తానన్న జగన్ ఎక్కడ అని ప్రశ్నించారు. మంగళగిరిలో మహిళపై ఆటోడ్రైవర్ దాష్టీకానికి ప్రభుత్వ భద్రతా వైఫల్యమే కారణమని విమర్శించారు. సీతానగరం గ్యాంగ్ రేప్ జరిగి రెండు నెలలు కావస్తున్నా నిందితున్ని పట్టుకోలేకపోయారని మండిపడ్డారు.
ANITA: 'జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది' - TDP leader Vangalapudi Anita latest news
జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ఆడబిడ్డకు కష్టమొస్తే గన్ను కంటే ముందొస్తానన్న జగన్ ఎక్కడ ? అని ప్రశ్నించారు.
అనిత
ప్రభుత్వ చర్యలు నిందితులకు సహకరించేలా ఉన్నాయన్నారు. వైకాపా పాలనలో మహిళలపై 500కు పైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయని తెలిపారు. బయటకు రావాలంటేనే ఆడబిడ్డలు భయపడుతున్నారన్నారు. మహిళ హోంమంత్రి వల్ల ఏం ఉపయోగమని నిలదీశారు. దిశా చట్టం వల్ల ఒరిగిందేమిటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: