ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజకీయ కక్షసాధింపుల్లో.. వారు భాగస్వాములు కావటం తగదు' - tenali shravn kumar latest updates

అఖిల భారత సర్వీసు అధికారులు రాజకీయ కక్షసాధింపుల్లో భాగస్వాములవటం తగదని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కొందరు అధికారులు పదవీ విరమణ తర్వాత చేకూరే ప్రయోజనాల కోసం పాలకుల చెప్పింది చేస్తున్నారని ఆరోపించారు.

తెనాలి శ్రావణ్ కుమార్
తెనాలి శ్రావణ్ కుమార్

By

Published : May 16, 2021, 11:33 AM IST

అఖిల భారత సర్వీసు అధికారులు రాజకీయ కక్షసాధింపుల్లో భాగస్వాములవటం తగదని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కొందరు అధికారులు పదవీ విరమణ తర్వాత చేకూరే ప్రయోజనాల కోసం ఇప్పుడు పాలకుల చెప్పింది చేస్తున్నారని ఆరోపించారు. "సీబీసీఐడీకి పనికిరాని సునీల్ కుమార్ ను తక్షణమే ఆ బాధ్యతల నుంచి తప్పించాలి" అని డిమాండ్ చేశారు.

"సునీల్ కుమార్ పై అతని భార్య కేసు పెట్టినందున, ప్రభుత్వం దానిని అనుకూలంగా మార్చుకుని కక్షసాధింపుల కోసం వాడుకుంటోంది. ప్రభుత్వ ఉచ్చులో పడి తన తెలివితేటలు, వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టొద్దని సునీల్ కుమార్ ను కోరుతున్నాం. ప్రభుత్వానికి కొమ్ముకాస్తే భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచించాలి. అఖిల భారత సర్వీసు అధికారులు సైతం నిష్పాక్షికంగా వ్యవహరించకపోవటం దురదృష్టకరం. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలతో సీబీసీఐడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కులాల ప్రస్తావన చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రభుత్వపెద్దలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?"అని శ్రావణ్ నిలదీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details