కోటిపల్లి-నర్సాపురం, విజయవాడ-విశాఖపట్నం మెట్రో, అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి గాలికొదిలేశారని తెదేపా నేత సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు. రూ.523కోట్లు ఖర్చుచేసిన కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ వద్దని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఆ రైల్వే లైన్ గత ప్రభుత్వ హయాంలో వచ్చింది కాబట్టి, పూర్తైతే తెదేపాకు పేరొస్తుందని ముఖ్యమంత్రి వద్దంటున్నారా? అని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి కావాలన్న కడప-బెంగళూరు రైల్వే లైన్ కూడా జగన్మోహన్ రెడ్డి వద్దంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం నిధులు, భూమి ఇవ్వకుంటే తాము రైల్వే ప్రాజెక్టులు ఎలా పూర్తిచేస్తామని కేంద్రమంత్రి చెప్పడం రాష్ట్రానికి అవమానం కాదా అని ప్రశ్నించారు.
'రైల్వే ప్రాజెక్టులు వద్దని కేంద్రానికి సీఎం లేఖ రాయడం దారుణం' - రైల్వే ప్రాజెక్టులపై టీడీపీ నేత సయ్యాద్ రఫీ కామెంట్స్
రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులు వద్దని ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖలు రాయడం దారుణమని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే.. తెదేపాకు పేరొస్తుందని సీఎం వద్దంటున్నారా? అని ప్రశ్నించారు.

tdp leader syed rafi on railway projects