రైతు ఉత్పత్తులకు కల్పించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కంపెనీలు రైతులకు పెట్టుబడులు పెట్టి తిరిగి వారి ఉత్పత్తులను కొనే విషయంలోనూ.. కనీస మద్దతు ధర ఒప్పందాలు జరగాలని స్పష్టం చేశారు. పేద రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని.. కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు.
'పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి' - delhi farmers protest updates
వ్యవసాయ బిల్లుల్లో సవరణ చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. దిల్లీలో 9 రోజులుగా రైతులు ప్రాణాలు లెక్కచేయకుండా నిరసన చేస్తున్నారన్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు.
ప్రైవేటు సంస్థలు ఎంత సరకునైనా నిల్వచేయవచ్చనే సౌలభ్యం వినియోగదారులకు భారంగా మారే ప్రమాదముందని సోమిరెడ్డి అన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన విధానంతో సవరణలు చేయాలని సూచించారు. రైతుల విషయంలో కేంద్రం పట్టువిడుపులతో వ్యవహరించి సత్వర నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీలో 9 రోజులుగా రైతులు చలిలో వణుకుతూ.. ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్నారని సోమిరెడ్డి గుర్తు చేశారు.
ఇదీ చదవండి: 'రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే.. ఈ నెల 7న నిరసన'