ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మమతాను చూసైనా జగన్ కళ్లు తెరవాలి: సోమిరెడ్డి - telugu language news

పశ్చిమబంగ ప్రభుత్వం.. తెలుగును అధికారిక భాషగా గుర్తించడం పట్ల తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Tdp leader Somireddy
తెదేపానేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Dec 23, 2020, 12:22 PM IST

తెదేపానేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్

తెలుగుపై బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకున్న గౌరవం మన ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్​లో తెలుగును అధికారిక భాషగా గుర్తించడం సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు.

మాతృభాషలో మాట్లాడటం ప్రజల హక్కుని, తల్లిభాషలో నేర్చుకున్న విద్యకే పరిపూర్ణత లభిస్తుందన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఇంగ్లీషు, హిందీ వంటి భాషలు అవసరమే.. కానీ వాటికోసం మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీని చూసైనా మన సీఎం వైఎస్ జగన్ కళ్లు తెరవాలని సోమిరెడ్డి హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details