సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి Somireddy on CM Jagan: సీఎం జగన్‌పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలుగు సినీ ప్రముఖులను ముఖ్యమంత్రి అవమానించిన తీరును తట్టుకోలేకపోతున్నానని.. సోమిరెడ్డి అన్నారు. నమస్కారం పెట్టిన అగ్రహీరోలకు ప్రతినమస్కారం పెట్టాలనే సంస్కారం... సీఎంకు లేకుండా పోయిందని విమర్శించారు. వేలాదిమంది ఆధారపడిన సినీపరిశ్రమకు... లేని సమస్య సృష్టించి... మళ్లీ తానే పరిష్కరిస్తున్నట్లు సీఎం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఐఏఎస్‌ను అవమానించారు...
మరోవైపు అఖిలభారత సర్వీసు అధికారుల్ని దారుణంగా అవమానించారన్నారు. ముఖ్యమంత్రికి సలామ్ కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను గంటలో తొలగించారన్నారు. సవాంగ్ దెబ్బతీసిన పోలీస్ ప్రతిష్టను... డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కొంతైనా కాపాడతారేమో వేచి చూడాలని... సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
సీఎం జగన్‌ను అగ్రహీరోలు కలిసిన సందర్భాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులండే హీరోలను ముఖ్యమంత్రి రెసిడెన్స్‌లో గేటు బయట దింపి నడిపిస్తారా...? చిరంజీవి తన చేతులతో నమస్కరించి సినీ పరిశ్రమను కాపాడండి అంటే తిరిగి సీఎం ప్రతినమస్కారం చేయరా...? దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీని టచ్ చేసినవాళ్లు లేరు. హీరోలను కించపరచడం దారుణం. మరోవైపు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు.-తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి
ఇదీ చదవండి: Controversies on Postings and Transfers : ముందు అందలం ఎక్కించి...ఆపై అవమానించి...