ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP Somireddy on Sand Mining: సీఎం జగన్ ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించాలి: సోమిరెడ్డి - సోమిరెడ్డి తాజా వార్తలు

Former minister Somireddy alleged Scam in sand mining: తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించాలని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై ఆయన విమర్శలు చేశారు. వేల కోట్ల రూపాయలు వైకాపా నాయకులు స్వాహా చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.

TDP Somireddy on Sand Mining
మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Dec 21, 2021, 12:33 PM IST

Updated : Dec 21, 2021, 12:55 PM IST

ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్ల అక్రమాలు: సోమిరెడ్డి

TDP Somireddy on Sand Mining: ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జేపీ పవర్ వెంచర్స్ ద్వారా జరిగే ఇసుక తవ్వకాలు, సరఫరాపై సమాచార చట్టం ద్వారా సేకరించిన వివరాలను మీడియా ముందు బయటపెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి.. పేదలకు ఇసుకను ఉచితం చేయాలని సోమిరెడ్డి కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో వాక్ స్వాతంత్య్రం పోయిందని.. ప్రశ్నిస్తే సొంతపార్టీ కార్యకర్తల్నే ఇష్టం వచ్చినట్లు కొట్టే పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు.

Former minister Somireddy news: రోజుకు 2000 లారీల అక్రమ ఇసుక రాష్ట్రం నుంచి అనధికారికంగా బయటకు పోతుందని విమర్శించారు. ఇసుక టన్ను రూ. 475 ధరగా నిర్ణయించామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.900కు కూడా అమ్మడమేంటని నిలదీశారు. ఇరిగేషన్ శాఖ చూసే ఇసుక కూడా జేపీ కంపెనీకే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. జేపీ కంపెనీకి పని దక్కేసరికి రూ. 70 కోట్ల విలువైన ఇసుక యార్డులో నిల్వ ఉందని.. ఆ ఆదాయం ఏమయ్యిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Last Updated : Dec 21, 2021, 12:55 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details