ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ మోహన్ రెడ్డీ.. ఇకనైనా మారవా..? : సోమిరెడ్డి - సీఎం జగన్​పై సోమిరెడ్డి ఆగ్రహం

Somireddy Chandramohan reddy: 'జగన్ మోహన్ రెడ్డీ.. ఇప్పటికైనా మారవా' అంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కేంద్రం.. మరోవైపు పొరుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తుంటే.. ముఖ్యమంత్రి స్పందించరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leader somireddy chandramohan reddy fires on cm jagan over tariffs on fuel prices
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : May 22, 2022, 11:46 AM IST

Somireddy Chandramohan reddy: 'జగన్ మోహన్ రెడ్డీ.. ఇప్పటికైనా మారవా?' అంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. పెట్రోల్​ పై 31 శాతం వ్యాట్ + రూ.4+రూ.1, డీజిల్ పై 22.5 శాతం వ్యాట్ + రూ.4 +రూ.1 పన్నులు వేసి... 151 సీట్లు ఇచ్చిన ప్రజలను బాదేస్తావా? అని మండిపడ్డారు. ఓ వైపు కేంద్రం.. మరోవైపు పొరుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంటే.. ముఖ్యమంత్రి మాత్రం స్పందించరా? అని ప్రశ్నించారు.

వ్యాట్​లో కనీసం 5 శాతంతోపాటు అదనంగా వేస్తున్న రూ.5 పన్ను తగ్గించినా లీటర్ కు 10 భారం తగ్గుతుందని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ.. మరోవైపు లక్షా 10 వేల కోట్లు ఎరువులపై రాయితీ ప్రకటించిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా.. రాష్ట్ర ప్రజలపై మాత్రం జగన్ కనికరం చూపరా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి కుమ్ముడే.. కుమ్ముడు అంటూ మరింత కుమ్మేస్తారా? అని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details