జగన్ పాలనలో సంచి నిండా డబ్బు తీసుకెళ్తే జేబు నిండా నిత్యవసరాలు వస్తున్నాయని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఎద్దేవా చేశారు. రేషన్ దుకాణాల్లోనూ నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై ఏటా రూ.600 కోట్ల భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను కాస్తా ప్రజా దళారీ వ్యవస్థగా మార్చేశారని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తలే దళారులుగా మారి రైతులు, ప్రజల్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
'ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రజా దళారీ వ్యవస్థగా మార్చేశారు' - వైకాపాపై మండిపడ్డ తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్
ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై పెను భారం మోపుతోందని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను కాస్తా ప్రజా దళారీ వ్యవస్థగా మార్చేశారని మండిపడ్డారు.

వైకాపాపై తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మండిపాటు