ఉపకులపతుల నియామకాల్లో సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ... విశ్వవిద్యాలయాలను కారడవులుగా మార్చారని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం ఉపకులపతుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇవ్వలేదని మండిపడ్డారు.
వైకాపా నేతలు విశ్వవిద్యాలయాల్లో వైఎస్సార్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ... పరిశోధన, బోధన అనేవి ఎక్కడా కానరాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచడం, పెంచడం, ముంచడం అనే మూడు విధానాలతోనే జగన్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పదవులున తనవాళ్లకు పంచుకుంటూ..,అన్నింటి ధరలు పెంచుతూ.. అమరావతి, పోలవరాన్ని మంచుతున్నారని దుయ్యబట్టారు.