PAYYAVULA KESAV: రాష్ట్రంలో భాజపా.. భారతీయ జగన్ పార్టీగా మారిపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ విమర్శించారు. విజయవాడలో నేడు జరిగేది ప్రజాగ్రహ సభ కాదని.. జగన్ అనుగ్రహ సభ అని పేరు మార్చుకుంటే సరిపోయేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నా..భాజపా నేతలు కనీసం నోరెత్తి మాట్లాడే పరిస్థితుల్లో లేరని కేశవ్ విమర్శించారు.
PAYYAVULA KESAV: భాజపా.. భారతీయ జగన్ పార్టీగా మారింది: పయ్యావుల - తెదేపా నేత పయ్యావుల కేశవ్
PAYYAVULA KESAV: విజయవాడలో నేడు జరిగేది ప్రజాగ్రహ సభ కాదని.. జగన్ అనుగ్రహ సభ అని పేరు మార్చుకుంటే సరిపోయేదని తెదేపా నేత సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అమిత్‌షా చెబితే తప్ప.. అమరావతి రైతులకు మద్దతివ్వాలన్న కనీస ఆలోచన రాష్ట్ర భాజపా నేతలకు రాలేదని మండిపడ్డారు.
విజయవాడలో జరిగేది ప్రజాగ్రహ సభ కాదు: పయ్యావుల
అమిత్‌షా చెబితే తప్ప.. అమరావతి రైతులకు మద్దతివ్వాలన్న కనీస ఆలోచన రాష్ట్ర భాజపా నేతలకు రాలేదని మండిపడ్డారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. ధర్మకర్తలకు అవమానం జరిగినా కనీసం స్పందించలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి మళ్లిస్తున్నా రాష్ట్ర భాజపా నేతల్లో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: