ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PATTABIRAM: 'సబ్ లీజుల పేరుతో మంత్రి వెల్లంపల్లి భారీ ఇసుక దోపిడీ' - విజయవాడ వార్తలు

లెక్కల్లో తేడాలు రావడం వల్లే మంత్రి వెల్లంపల్లి చేస్తున్న ఇసుక దోపిడీ వ్యవహారం బయటకొచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం ఆరోపించారు. సబ్​ లీజుల మాటున జరుగుతున్న వ్యవహారానికి ప్రకాశ్​ పవర్​ సంస్థ ఉద్యోగి ఫిర్యాదే నిదర్శనమన్నారు.

PATTABIRAM
PATTABIRAM

By

Published : Aug 15, 2021, 4:34 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకరీచ్​లను నిర్వహిస్తున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సబ్ లీజుల పేరుతో.. మంత్రి వెల్లంపల్లి భారీ ఇసుక దోపిడీకి పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఉద్యోగి విశ్వనాథన్ సతీశ్.. భవానీపురం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదే అందుకు నిదర్శనమని అన్నారు.

తాను సాగించిన వందల కోట్ల దోపిడీ తాలూకా లెక్కలను మంత్రి వెల్లంపల్లి, "తాడేపల్లికి సరిగా చెప్పనందుకే" వాటాల్లో తేడాలొచ్చాయని.. అందుకే మంత్రి వెల్లంపల్లి, ఆయన సోదరుడు, బంధువులు సాగించిన ఇసుకదోపిడీ వ్యవహారం బట్టబయలైందని వ్యాఖ్యలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details