108 వాహనాల కుంభకోణంపై ఆధారాలను బయటపెట్టినందుకు తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. కుంభకోణంలో ఎంపీ విజయసాయి రెడ్డి పాత్రపై డాక్యుమెంట్ ఎవిడెన్స్‌తో బయట పెట్టినందుకు తనను చంపేస్తానంటూ కొందరు బెదిరిస్తున్నారని పట్టాభి మండిపడ్డారు.
'కుంభకోణాలు బయటపెడితే చంపేస్తామని బెదిరిస్తారా ?' - 108 కుంభకోణం
108 కుంభకోణంలో ఎంపీ విజయసాయి రెడ్డి పాత్రపై డాక్యుమెంట్ ఎవిడెన్స్‌తో బయట పెట్టినందుకు తనను చంపేస్తానంటూ కొందరు బెదిరిస్తున్నారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ బెదిరింపులకు లొంగనని తేల్చి చెప్పిన ఆయన.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'కుంభకోణాలు బయటపెడితే చంపేస్తామని బెదిరిస్తారా ?'
307 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెడితే తప్పు చేసిన వారిని వదిలేసి పోలీసులు నన్ను గృహనిర్భందం చేయటమేంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ బెదిరింపులకు లొంగనని తేల్చి చెప్పిన పట్టాభి.., తప్పు చేసిన వారిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.